ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కల్వర్ట్​ను ఢీకొట్టిన ఇన్నోవా కారు శంషాబాద్​లో ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్ వాయిస్, హైదరాబాద్ : వినాయకుడిని పూజించి సంతోషంగా నగరానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని విధి మార్గమధ్యలో కబళించింది. స్వగ్రామంలో పూజలు ముగించుకుని కారులో బయలుదేరిన కొద్దిసేపటికే జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం చౌడూర్ గ్రామానికి చెందిన కేతావత్ లింబ్య,...