చేయూత పెన్షన్ దరఖాస్తులకు గడువు పొడిగింపు
స్పాట్ వాయిస్, దామెర: చేయూత పెన్షన్ పథకం కింద కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకు గడువును సెప్టెంబర్ 15, 2026 వరకు పొడిగించినట్లు ఎంపీడీవో గుమ్మడి కల్పన తెలిపారు. మండలంలోని అర్హులైన సింగిల్ ఉమెన్, వితంతువులు, వికలాంగులు, గీత, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసీమియా, సికిల్ సెల్, హీమోఫీలియా బాధితులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలతో సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తులు సమర్పించాలన్నారు. గడువు ముగిసిన తర్వాత అవకాశం ఉండకపోవచ్చని, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని...