కాంగ్రెస్‌ వచ్చింది.. కరెంట్‌ పోయింది

సింగరేణి, కేటీపీపీని నిర్వీర్యం చేస్తున్నారు.. బొగ్గు కొరతతో విద్యుత్‌ ఉత్పత్తి పడిపోయింది రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పాట్‌ వాయిస్‌, గణపురం: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. వ్యవసాయానికి రోజుకు నాలుగైదు గంటలు కూడా విద్యుత్‌ అందని పరిస్థితి నెలకొందని, నీళ్లు రాక, కరెంట్‌ లేక పంటలు ఎండిపోతుంటే రైతులు సబ్‌స్టేషన్ల వద్ద నిరసనలు, రాస్తారోకోలు చేస్తున్నారని అన్నారు. రైతుల ఆందోళనలను పోలీసులు అణచివేస్తున్నారని...