SPOT VOICE
Newspaper Banner
Date : 11 September 2026, 11:35 am Posted By : SPOT VOICE MEDIA

రేగొండలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ధర్నా

స్పాట్ వాయిస్, రేగొండ: రేగొండ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కూడలి వద్ద కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పున్నం రవి ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ నాయకులు అసెంబ్లీ గౌరవాన్ని కాపాడకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రవి విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దళితులపై అవమానకర చర్యలను ఖండిస్తూ సామాజిక వివక్షకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కమిటీ చైర్మన్‌ కిష్టయ్య, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు పాల్గొన్నారు.