SPOT VOICE
Newspaper Banner
Date : 01 September 2026, 1:44 pm Posted By : SPOT VOICE MEDIA

బావ–బామ్మర్దుల మధ్య ఘర్షణ.. కత్తులతో దాడి

స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో  మంగళవారం మధ్యాహ్నం కుటుంబ కలహాలతో బావ–బామ్మర్దుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రఘునాథపల్లికి చెందిన పర్వతగిరి అర్జున్‌ (22), వరంగల్‌కు చెందిన సిరిగిరి రాజ్‌కుమార్‌ (30) మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారి కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరూ కత్తిపోట్లకు గురైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.