ఎరువులకు ఇక యాప్ బుకింగ్!
స్పాట్ వాయిస్, దామెర: సెప్టెంబర్ 2 నుంచి దామెర మండలంలో ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ విధానం అమల్లోకి రానుందని మండల వ్యవసాయ అధికారి అల్లె రాకేష్ తెలిపారు. రైతులు ముందుగానే యాప్‌లో ఫార్మర్ ఐడీ లేదా ఆధార్‌తో నమోదు చేసుకుని, భూమి, పంట వివరాలు నమోదు చేయాలన్నారు. అవసరమైన ఎరువులను బుక్ చేసుకున్న అనంతరం క్యూ ఆర్ కోడ్, టోకెన్ నంబర్ ఆధారంగా విక్రయ కేంద్రాల్లో ఎరువులు పొందవచ్చన్నారు. రైతులు ముందస్తు నమోదుతో పారదర్శకంగా ఎరువులు పొందాలని సూచించారు.