బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేశాయో చెప్పాలి..: ఎమ్మెల్యే నాయిని
బీజేపీ, బీఆర్ఎస్ ఏం చేశాయో చెప్పాలి స్పాట్ వాయిస్, హనుమకొండ: గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ వరంగల్ అభివృద్ధికి ఏం చేశాయో ప్రజలకు చెప్పాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ డీసీసీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో వరంగల్ అభివృద్ధికి భారీగా నిధులు తీసుకొచ్చిందన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి సుమారు రూ.5,300 కోట్లు, శాశ్వత తాగునీటి వసతుల కోసం రూ.550 కోట్లకు...