SPOT VOICE
Newspaper Banner
Date : 27 August 2026, 10:30 am Posted By : SPOT VOICE MEDIA

హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో వినయ్‌ భాస్కర్‌ హౌస్‌ అరెస్ట్

స్పాట్ వాయిస్, హన్మకొండ: జీవో నెం.97 శక్తి స్కీం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ తన్నీరు హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో మాజీ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హరీశ్‌రావు పర్యటనకు ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.