ఉదయ్ కృష్ణారెడ్డికి డీఎన్‌ఏ పరీక్షలు..
కీలక ఆధారాలపై పోలీసుల దృష్టి స్పాట్ వాయిస్, హైదరాబాద్ , తెలంగాణలో సంచలనం సృష్టించిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి నుంచి సేకరించే రక్త నమూనాలను.. బాధితురాలి గాయాలు, దుస్తులపై లభించిన ఆధారాలతో పోల్చి చూడనున్నారు. ఈ పరీక్షల ద్వారా నిందితుడికి, ఘటనాస్థలంలో లభించిన జీవసంబంధ ఆధారాలకు సంబంధం ఉందా లేదా అన్నది నిర్ధారించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసుల...