స్పాట్ వాయిస్, స్పోర్ట్స్: ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు, షట్లర్ గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్‌లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభతో ఈ గౌరవాన్ని దక్కించుకున్న ఇద్దరూ తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు–2025కు ఎంపికైన, అవార్డులు అందుకున్న క్రీడాకారులందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. వారి అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.