SPOT VOICE
Newspaper Banner
Date : 18 August 2026, 9:55 am Posted By : SPOT VOICE MEDIA

పెద్ది విగ్రహం తొలగింపు.. కన్నీరు పెట్టుకున్న పెద్ది స్వప్న

స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేటలో ఉద్యమ నాయకుడు పెద్ది విగ్రహాన్ని తొలగించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహాన్ని తొలగించడంతో పెద్ది స్వప్న తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్తను తలచుకుంటూ “నువ్వు లేకపోతే ఎలా జరుగుతుందో చూడు” అంటూ విలపించారు. ఆమె ఆవేదనతో అక్కడున్న పలువురు భావోద్వేగానికి లోనయ్యారు. విగ్రహం తొలగింపు నిర్ణయంపై స్థానికులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన నేపథ్యంలో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని తొలగించడంపై నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.