ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తాం..

నేడు మేం పరుగెత్తాం.. రేపటి నుంచి సర్కారు వంతు.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ 2కే రన్ స్పాట్ వాయిస్, హనుమకొండ: ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం హనుమకొండలోని ఏకశిల పార్క్‌ నుంచి ఆర్ట్స్‌ కళాశాల వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. టీఎన్‌జీవోస్ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు...