బలవంతపు మత మార్పిడులకు అడ్డుకట్ట..
స్పాట్ వాయిస్, బ్యూరో : బలవంతపు, మోసపూరిత మత మార్పిడులను అడ్డుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ‘ద మహారాష్ట్ర ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్, 2026’ ఆగస్టు 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. బలవంతం, తప్పుడు హామీలు, మోసం లేదా అనుచిత మార్గాల ద్వారా మతం మార్చే ప్రయత్నాలను ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. నేరం రుజువైతే గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. మైనర్లు, మానసిక సమస్యలు ఉన్నవారు, ఎస్సీ,...