బెల్ట్ షాపుల నియంత్రణకు గ్రామసభలో వినతి

స్పాట్ వాయిస్, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలో బెల్ట్ షాపుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం జరిగిన గ్రామసభలో వినతిపత్రం అందజేశారు. బెల్ట్ షాపుల వల్ల గ్రామంలో మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తోందని పేర్కొన్నారు. దీంతో యువతపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామసభలో అందజేసిన వినతిపత్రంపై అధికారులు స్పందించి...