SPOT VOICE
Newspaper Banner
Date : 18 August 2026, 10:25 pm Posted By : SPOT VOICE MEDIA

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు.. బీఆర్ఎస్ నేతల అరెస్టు

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు.. బీఆర్ఎస్ నేతల అరెస్టు

స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించిన అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. సాయంత్రం విడుదలైన వారిలో రాయుడి రవీందర్ రెడ్డి, నల్ల మనోహర్ రెడ్డి, నాగేల్లి వెంకట్ నారాయణ గౌడ్, వేణుముద్దల శ్రీధర్ రెడ్డి, నవీన్ నాయక్, దొమ్మటి సంతోష్, మంద ప్రసాద్, చుక్క అనిల్, బైరి నాగరాజు, గట్టు కార్తీక్, శీలం వీరన్న, దార్ల రమాదేవి, నాయిని సునీత, వాసం కరుణ, చింతం విజయరాణి, వెళ్లదండి స్వరూప, ఇస్రం స్వాతి ఉన్నారు.

వారిని డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, తక్కలపల్లి రవీందర్‌రావు, మచ్చిక నరసయ్య, దాసరి నరసింహారెడ్డి, మండల శ్రీనివాస్, నాగిశెట్టి ప్రసాద్, తాళ్లపల్లి రాంప్రసాద్, మెదద శ్రీను, తోటకూరి సదానందం, నాగేల్లి అరవింద్ గౌడ్, నల్ల రవి తదితరులు కలిసి పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.