పేద పద్మశాలి కుటుంబానికి నిత్యావసరాలు అందజేత
స్పాట్ వాయిస్, స్టేషన్ ఘన్పూర్: ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన స్టేషన్ ఘన్ పూర్ మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన పద్మశాలి కులస్తుడు గుర్రపు అంజయ్య కుటుంబానికి జనగామ జిల్లా ఔషధ నియంత్రణ అధికారి, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలె బాలకృష్ణ అండగా నిలిచారు. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు సూచన మేరకు, మృతుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బాలకృష్ణ మానవతా దృక్పథంతో స్పందించారు. తన వంతు సాయంగా ఆ...