భూపాలపల్లి, స్పాట్ వాయిస్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా భూపాలపల్లి బస్టాండ్లో ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. పండుగ రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేయకపోవడం, ఉన్న బస్సులు సైతం ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిజర్వేషన్ చేసుకున్నవారికి కూడా తిప్పలు తప్పలేదు. బస్సు వస్తుందన్న సమాచారం అందగానే ప్రయాణికులు పరుగులు తీయడంతో తొక్కిసలాట ప్రమాదం నెలకొంది. భద్రతా సిబ్బంది లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సుల రాకపోకలపై అధికారులను ప్రశ్నించగా సరైన సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. పండుగల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు ఏర్పాటు చేసి, సమయపాలన, ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.