నేషనల్‌ బెస్ట్‌ టీచర్‌ గా బొంపెల్లి భవానీ

తెలంగాణ నుంచి ఒక్కరే ఒక్కరు.. యూట్యూబ్‌ ‘పంతులమ్మ’గా ఫేమస్‌.. వినూత్న బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి పెంపు దేశవ్యాప్తంగా 48 మంది ఎంపిక.. సెప్టెంబర్‌ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. 2026 సంవత్సరానికి కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు తెలంగాణ నుంచి ఆమె ఒక్కరే ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల...