SPOT VOICE
Newspaper Banner
Date : 28 August 2026, 6:55 pm Posted By : SPOT VOICE MEDIA

అన్నలకు రాఖీ కట్టి అనుబంధాన్ని చాటిన నాన్సీ

స్పాట్ వాయిస్, పరకాల : రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాన్సీ తన అన్నలకు ప్రేమతో రాఖీ కట్టి ఆత్మీయతను చాటుకుంది. తొలిసారి  నుదుటన తిలకం దిద్ది, హారతి ఇచ్చి రాఖీ కట్టింది. అన్నలు సంతోషంగా కానుకలు అందజేసి, జీవితాంతం ఆమెకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతకు రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.