SPOT VOICE
Newspaper Banner
Date : 09 August 2026, 11:25 am Posted By : SPOT VOICE MEDIA

ప్రతి శనివారం మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

స్పాట్ వాయిస్, హన్మకొండ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కాంగ్రెస్యు వ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం 60వ డివిజన్‌లోని పలు కాలనీల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం బ్యాంక్ కాలనీలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సుమారు 20 మొక్కలు నాటారు. ప్రతి శనివారం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చన్నారు.