స్పాట్ వాయిస్, నల్లబెల్లి: మెడికల్ కాలేజీ ముందు ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపుపై అఖిల భారత హిందూ మహాసభ నాయకుడు కొనకటి రమేష్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాలను రాజకీయ కక్షలకు వేదికగా మార్చడం సరికాదన్నారు. విగ్రహం తొలగింపునకు కారణాలు, అధికారిక అనుమతులు, నిబంధనలను ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. రాజకీయ భేదాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలని సూచించారు.