స్పాట్ వాయిస్, బ్యూరో : కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ డిమాండ్ చేశారు. సుష్మితకు నాయకత్వం ఇచ్చే హక్కు లేదని వ్యాఖ్యానించారు. “మీపై చర్యలు తీసుకుంటే బీసీ కార్డు వాడాలని చూస్తారు. మీరు మారని పార్టీ లేదు.. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నేతలనే విమర్శిస్తారు” అంటూ మంత్రి సురేఖపై తీవ్ర విమర్శలు చేశారు.