గోనె సంచిలో మృతదేహం
హైదరాబాద్‌లో దారుణ హత్య స్పాట్ వాయిస్, హైదరాబాద్ : బాలాపూర్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని ప్రియుడే కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి అక్కడి నుంచి పరారైనట్లు వెల్లడించారు. బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటున్న రెహానా, మహ్మద్ సలామ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకోవాలని రెహానా ఒత్తిడి చేయడంతో సలామ్ ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి...