షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

భారీగా ​ఆస్తి నష్టం.. ప్రాణాలతో బయటపడ్డ కుటుంబ సభ్యులు ​ఆదుకోవాలని బాధితుల వేడుకోలు స్పాట్ వాయిస్, ​గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బానాల (కమ్మరి) రవి ఇంట్లో రాత్రి 8 గంటల సమయంలో ఫ్రిడ్జ్ వద్ద అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. మంటల తీవ్రతను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే...