SPOT VOICE
Newspaper Banner
Date : 28 August 2026, 10:16 am Posted By : SPOT VOICE MEDIA

ప్రజలoదరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.

స్పాట్ వాయిస్, నర్సంపేట: సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు రాఖీ పౌర్ణమి ప్రతీక అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కష్టాల్లో అండగా నిలవడం, సుఖాల్లో కలిసి ఆనందించడం, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండటమే రాఖీ పండుగ స్ఫూర్తి అన్నారు. రాఖీ పౌర్ణమి ప్రతి ఇంట ఆనందాన్ని, ప్రతి కుటుంబంలో ఆప్యాయతను నింపాలని, సోదర సోదరీమణుల మధ్య ప్రేమానుబంధాలు చిరకాలం కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.