గుడిసెవాసులకు అండగా ప్రభుత్వం
స్పాట్ వాయిస్, కాజిపేట: గుడిసెవాసులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తున్నామని తెలిపారు. కాజీపేటను అన్ని విధాలుగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డితో తమకు తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు ఉన్నాయని గుర్తుచేశారు. పెద్ది మృతిని అడ్డుపెట్టుకుని బీఆర్‌ఎస్ శవరాజకీయాలు చేస్తోందని విమర్శించారు. పెద్ది అంతిమయాత్రను అధికార లాంఛనాలతో నిర్వహించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో పేదలను దోచుకున్నారని, ప్రాజెక్టుల పేరుతో కేటీఆర్, హరీశ్‌రావు...