SPOT VOICE
Newspaper Banner
Date : 12 August 2026, 3:07 pm Posted By : SPOT VOICE MEDIA

కొండాపూర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

కొండాపూర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

​నిందితుడి అరెస్ట్, సొత్తు స్వాధీనం

​వేగంగా స్పందించిన పోలీస్ సిబ్బందికి అభినందనలు

స్పాట్ వాయిస్, ​గణపురం:మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కేసు వివరాలను బుధవారం ఎస్సై బి. అశోక్ వెల్లడించారు. ​ఈ నెల 10వ తేదీన కొండాపూర్ గ్రామానికి చెందిన దానం సమ్మయ్య ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో దర్యాప్తు వేగవంతం చేశారు. పక్కా సమాచారంతో చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెందిన బొట్టు రమణాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించాడు. ​నిందితుడి నుంచి చోరీకి గురైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రమణాకర్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు అతనికి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎస్సై తెలిపారు. ​ఫిర్యాదు అందగానే త్వరితగతిన స్పందించి, స్వల్ప వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్న ఎస్సై అశోక్ ను, పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులతో పాటు మండల ప్రజలు ప్రత్యేకంగా అభినందించారు.