బద్దెల మల్లయ్యను పరామర్శించిన గండ్ర

స్పాట్ వాయిస్,​  భూపాలపల్లి: అనారోగ్యంతో హన్మకొండలోని మెడికవర్ హాస్పిటల్‌‌‌‌లో చికిత్స పొందుతున్న సింగరేణి కార్మికుడు, టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ బద్దెల వంశీ తండ్రి బద్దెల మల్లయ్యను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు గండ్ర గౌతమ్‌‌‌‌రెడ్డి గురువారం పరామర్శించారు. ​హాస్పిటల్‌‌‌‌కు వెళ్లిన నేతలు మల్లయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మల్లయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.