ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు

జనసేన పార్టీ నిర్ణయం.. అధినేత పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం స్పాట్ వాయిస్, హైదరాబాద్ : ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావును ముందస్తుగా ప్రకటించింది. పార్టీ రాష్ట్ర నాయకుడిగా, అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న గడల శ్రీనివాసరావును ఎమ్మెల్సీ బరిలో నిలపాలని పార్టీ నిర్ణయించింది. ఆయన అభ్యర్థిత్వానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేసినట్లు పార్టీ తెలిపింది. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయి బాధ్యతలు...