SPOT VOICE
Newspaper Banner
Date : 18 August 2026, 10:51 am Posted By : SPOT VOICE MEDIA

పెద్ది విగ్రహం తొలగింపును ఖండించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

స్పాట్ వాయిస్, నల్లబెల్లి: నర్సంపేటలోని ఆసుపత్రి ప్రాంతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సాంబారావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, ఆయన విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజలు, ఉద్యమకారులు కోరుతున్నప్పటికీ ఆయన పేరును మెడికల్ కాలేజీకి పెట్టే అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. విగ్రహం తొలగింపును ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు ఖండించి, ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. అక్రమంగా అరెస్టు చేసిన సర్పంచులు, ప్రజాప్రతినిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమకారులంతా ఏకమై మరో పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.