పుట్ట మధుపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు

స్పాట్ వాయిస్ మల్హర్: పుట్ట మధుపై కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని బీఆర్‌ఎస్ నాయకుడు బానోత్ రాజ్‌కుమార్ అలియాస్ ఢిల్లీ రాజు హెచ్చరించారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. ఆన్సాన్‌పల్లిలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన మహిళలకు రూ.2,500, రూ.4,000 పింఛన్లు, స్కూటీలు, తులం బంగారం వంటి హామీల అమలుపై ప్రశ్నిస్తున్నందుకే ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మంథనికి చేసిన అభివృద్ధిపై సమాధానం చెప్పకుండా చౌకబారు...