SPOT VOICE
Newspaper Banner
Date : 21 August 2026, 1:36 pm Posted By : SPOT VOICE MEDIA

“రక్తం తాగింది చాలు.. పార్టీ నుంచి వెళ్లిపోండి”

 

స్పాట్ వాయిస్ హన్మకొండ : కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. పార్టీలోనే కొందరు గుంటనక్కలు సురేఖకు అండగా ఉంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, తమలాంటి పార్టీ నాయకులను అవమానించడం ఇక సహించబోమన్నారు. పార్టీ నుంచి బహిష్కరించే పరిస్థితి రాకముందే సురేఖ స్వచ్ఛందంగా వెళ్లిపోతే మంచిదని సూచించారు. తమను అవమానపరుస్తూ రక్తం తాగుతామంటే చూస్తూ ఊరుకోబోమని నాయిని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, నాయిని-సురేఖ మధ్య విభేదాలు గతంలోనూ బహిరంగంగా వ్యక్తమైనట్లు వార్తలు వచ్చాయి.