రెంట్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆఫర్లతో సైబర్‌ వల

యువతులే లక్ష్యంగా ఆన్‌లైన్‌ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక స్పాట్ వాయిస్. దరాబాద్‌: సోషల్‌ మీడియాలో ‘రెంట్‌ బాయ్‌ఫ్రెండ్‌’, ‘పర్సనల్‌ కంపానియన్‌’ పేరుతో ప్రచారం అవుతున్న ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక సైబర్‌ మోసాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా యువతులను లక్ష్యంగా చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో కలర్‌ఫుల్‌ పోస్టర్లతో ఈ ఆఫర్లను ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘కాఫీ డేట్‌’, ‘సినిమా డేట్‌’, ‘షాపింగ్‌ కంపానియన్‌’, ‘ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడు’ అంటూ వివిధ ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. గంటకు...