కాళేశ్వరంలో కాంగ్రెస్‌ కమిటీ ఎన్నికపై గందరగోళం

స్పాట్ వాయిస్, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో కాంగ్రెస్‌ గ్రామశాఖ కమిటీ ఎన్నిక వివాదాస్పదమైంది. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులను తీసుకొచ్చి కమిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ సుమారు 60 మంది నాయకులు, కార్యకర్తలు ఎన్నికను బహిష్కరించారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఎన్నికను రద్దు చేసి, అధిష్ఠానం పర్యవేక్షణలో పారదర్శకంగా ఎన్నిక నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నిక రద్దు చేయకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు.