చమోలిలో విషాదం..
టన్నెల్‌లోకి భారీగా నీరు, శిథిలాలు.. ఏడుగురు కార్మికులు మృతి చమోలి: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న టన్నెల్‌లోకి ఒక్కసారిగా భారీగా నీరు, శిథిలాలు దూసుకురావడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులు టన్నెల్‌లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రాజెక్టు ప్రాంతంలో మొత్తం 22 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 14 మంది గాయపడగా, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. [video width="640" height="360"...