SPOT VOICE
Newspaper Banner
Date : 18 August 2026, 7:32 am Posted By : SPOT VOICE MEDIA

కాజిపేటలో దారుణ హత్య..!

స్పాట్ వాయిస్, కాజీపేట :హనుమకొండ జిల్లా కాజిపేట మండలం రాంపూర్ ఊరచెరువులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఘటన స్థలంలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతుడిని చిల్పూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య (45)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.