స్పాట్ వాయిస్, గణపురం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని భూపాలపల్లి, మంథని నియోజకవర్గాలకు సంబంధించి పలు మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి…
భూపాలపల్లి నియోజకవర్గం:
– భూపాలపల్లి టౌన్: దాట్ల శ్రీనివాస్
– భూపాలపల్లి మండలం: రామినేని రవీందర్
– గణపురం: తాళ్లపెల్లి భాస్కర్ రావు
– రేగొండ: పున్నం రవి
– కొత్తపల్లిగోరి: సూదనబోయిన ఓం ప్రకాష్
– చిట్యాల: దబ్బెట అనిల్
– టేకుమట్ల: తిప్పిరెడ్డి కృష్ణా రెడ్డి
– మొగుళ్లపల్లి: ఎండీ రఫీక్
మంథని నియోజకవర్గం:
– కాటారం: తెప్పల దేవేందర్
– మహాదేవ్ పూర్: కాట్కం అశోక్
– మహాముత్తారం: జాడి రాజయ్య
– మల్హర్ రావు: జింగిడి శ్రీనివాస్
– పలిమెల: దండేర రాజేందర్
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. నూతన కమిటీల నియామకం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.