స్పాట్ వాయిస్, భూపాలపల్లి: జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కార్యాలయంలో పలు రికార్డులు, పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.