ఉబర్ బైక్ సేవలు వరంగల్‌లో ప్రారంభం
స్పాట్ వాయిస్, హన్మకొండ : వరంగల్ నగరంలో ఉబర్ బైక్ సేవలను ఉబర్ సంస్థ ప్రారంభించింది. ప్రారంభ ఆఫర్‌గా కొత్త ప్రయాణికులకు పరిమిత కాలం పాటు తొలి రైడ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగాలు, కళాశాలలు, రోజువారీ అవసరాలకు వేగవంతమైన, సరసమైన రవాణా సౌకర్యంతో పాటు స్థానిక డ్రైవర్లకు ఆదాయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపింది. ప్రారంభ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ ఉబర్ బైక్ డ్రైవర్లకు ఐఎస్‌ఐ ప్రమాణాల హెల్మెట్లు పంపిణీ...