SPOT VOICE
Newspaper Banner
Date : 29 July 2026, 8:01 am Posted By : SPOT VOICE MEDIA

ఉబర్ బైక్ సేవలు వరంగల్‌లో ప్రారంభం

స్పాట్ వాయిస్, హన్మకొండ : వరంగల్ నగరంలో ఉబర్ బైక్ సేవలను ఉబర్ సంస్థ ప్రారంభించింది. ప్రారంభ ఆఫర్‌గా కొత్త ప్రయాణికులకు పరిమిత కాలం పాటు తొలి రైడ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగాలు, కళాశాలలు, రోజువారీ అవసరాలకు వేగవంతమైన, సరసమైన రవాణా సౌకర్యంతో పాటు స్థానిక డ్రైవర్లకు ఆదాయ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని తెలిపింది. ప్రారంభ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ ఉబర్ బైక్ డ్రైవర్లకు ఐఎస్‌ఐ ప్రమాణాల హెల్మెట్లు పంపిణీ చేశారు. నగరంలో ఫస్ట్–లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపడుతుందని వారు పేర్కొన్నారు. ఉబర్ ఇండియా కన్సూమర్ అండ్ గ్రోత్ డైరెక్టర్ రిషాంత్ ఘోష్ మాట్లాడుతూ.. వరంగల్ ప్రజలకు విశ్వసనీయమైన రవాణా సేవలతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉబర్ కట్టుబడి ఉందన్నారు. ప్రతి రైడ్‌లో రియల్‌టైమ్ ఐడీ చెక్, ఎస్‌ఓఎస్ బటన్, 24×7 సేఫ్టీ లైన్, ట్రిప్ షేరింగ్ వంటి భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.