బొల్లికుంటలో ఉద్రిక్తత.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అరెస్ట్

స్పాట్ వాయిస్, వరంగల్ :  వరంగల్ జిల్లా బొల్లికుంటలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులకు మద్దతుగా హిందూ సంఘాల నేతలు, బీజేపీ నాయకులు గ్రామానికి చేరుకున్నారు. ఘటన స్థలానికి వచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం గంట రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. [video width="478" height="850" mp4="https://spotvoice.in/wp-content/uploads/2026/07/VID-20260717-WA0032.mp4"][/video]