చంపేసిన సోషల్ మీడియా… బతికించిన వైద్యం!
అరకొర సమాచారం భయం పుట్టిస్తే.. వైద్యుల చికిత్స ఆశ నింపింది.. స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అస్వస్థతకు గురైన వెంటనే సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తాయి. అధికారిక సమాచారం రాకముందే కొందరు ఆయన మరణించినట్లు పోస్టులు పెట్టగా, మరికొన్ని మీడియా సంస్థలు కూడా ధృవీకరణ లేకుండానే అదే సమాచారాన్ని ప్రసారం చేశాయి. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మొదట రోహిణి ఆసుపత్రిలో అత్యవసర...