SPOT VOICE
Newspaper Banner
Date : 05 July 2026, 10:07 am Posted By : SPOT VOICE MEDIA

కేటీఆర్ పర్యటన నేపథ్యంలో రంజిత్ రెడ్డి హౌస్ అరెస్ట్

 

స్పాట్ వాయిస్ , హనుమకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం  పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డిని పోలీసులు ఆదివారం ఉదయం ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతియుతంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే నాయకులను ముందస్తుగా గృహనిర్బంధం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. కేటీఆర్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే హౌస్ అరెస్ట్‌లు చేపట్టారని ఆరోపించారు.