SPOT VOICE
Newspaper Banner
Date : 01 July 2026, 10:59 am Posted By : SPOT VOICE MEDIA

వరంగల్ సీపీ గా ఎన్. శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ

వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ

స్పాట్ వాయిస్, క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతారెడ్డి సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం కమిషనర్‌గా విధులు నిర్వహించిన సన్ ప్రీత్ సింగ్ నుంచి ఆమె బాధ్యతలను చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికారులు నూతన కమిషనర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ సేవలు అందించడం, నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తూ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు.