హనుమకొండ కిడ్నాప్ కేసు… ముగ్గురు అదుపులో
స్పాట్ వాయిస్, క్రైమ్ : హనుమకొండ కిడ్నాప్ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న పింగిలి ప్రదీప్ రెడ్డి తో పాటు మరో ఇద్దరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న వీరిని విశాఖపట్నంలో గుర్తించి అదుపులోకి తీసుకుని వరంగల్‌కు తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ అరెస్టులపై వరంగల్ పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.