మిత్రుడి కుటుంబానికి ఆర్థికసాయం అందజేత
స్పాట్ వాయిస్, హసన్ పర్తి : మండలంలోని బైరాన్‌పల్లికి చెందిన జట్టి కుమార స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. బుధవారం కుమారస్వామి దశదిన కర్మ సందర్భంగా అతడి టెన్త్క్లాస్మేట్స్ అందరూ కలిసి కుమారస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అలాగే మిత్రులందరూ కలిసి అతడి కుటుంబానికి ఆర్థికసాయంగా రూ.42511అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మిత్రులు పాల్గొన్నారు.