నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి

స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (52) శుక్రవారం తెల్లవారుజామున 12.51 గంటలకు హైదరాబాద్‌లో కన్నుమూశారు. జూలై 26న హనుమకొండలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం పల్మనరీ ఎంబోలిజం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో ఆయన ఆరోగ్యం విషమించింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించక తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పార్థివదేహాన్ని ఉదయం హనుమకొండ...