SPOT VOICE
Newspaper Banner
Date : 05 July 2026, 8:04 am Posted By : SPOT VOICE MEDIA

కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

స్పాట్ వాయిస్, రఘునాథ్ పల్లి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కానేపల్లి పర్యటనకు రానున్న నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఆదివారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రఘునాథ్ పల్లి మాజీ ఎంపీపీ వై. కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ ఎడ్ల బాలరాజు, నాయకులు రాకేష్, కిరణ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వై. కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకోవడం సరికాదని, అరెస్టులతో బీఆర్ఎస్ కార్యక్రమాలను నిలువరించలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.