కాజీపేటకు రైల్వే డివిజన్, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్
స్పాట్ వాయిస్, కాజీపేట: కాజీపేటను వెంటనే రైల్వే డివిజన్‌గా ప్రకటించాలని, కాజీపేటలో ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులు, స్థానిక యువతకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్లను అమలు చేయాలని వారు కోరారు.