హసన్‌పర్తి పెద్దచెరువులో మహిళ మృతదేహం లభ్యం
స్పాట్ వాయిస్, హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని పెద్దచెరువులో ఓ మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వివరాలు, మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.